Nandamuri Balakrishna: సౌండ్‌ కంట్రోల్‌లో పెట్టుకో.. అంటోన్న నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna in Akhanda 2 Sound Control Roar
  • 'అఖండ-2' బ్లాస్టింగ్‌ రోర్‌ వీడియో విడుదల 
  • డిసెంబర్‌ 5న సినిమా రిలీజ్‌ ఫిక్స్‌ 
  • బ్లాస్టింగ్‌ వీడియోలో అలరిస్తున్న సంభాషణలు

సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో... ఏ సౌండ్‌కు నవ్వుతానో... ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు.. కొడకా.. ఊహకు కూడా అందదు.. అంటూ నందమూరి బాలకృష్ణ చెప్పిన మాస్ అండ్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అఖండ-2 తాండవం బ్లాస్టింగ్ రోర్ వీడియో నందమూరి అభిమానులను విశేషంగా అలరిస్తోంది. శుక్రవారం బ్లాస్టింగ్ రోర్ పేరిట అఖండ-2 మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. 56 సెకన్ల పాటు కొనసాగిన ఈ బ్లాస్టింగ్ వీడియోలో బాలకృష్ణ మోస్ట్ మాసివ్ సంభాషణలు సోషల్ మీడియాలో ఇప్పటికే హల్‌చల్ చేస్తున్నాయి.

డిసెంబరు 5న థియేట్రికల్ రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను నిర్దేశకుడు. రామ్ ఆచంట, గోపి ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎం తేజస్విని నందమూరి ప్రజెంట్స్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంతకు ముందు బాలకృష్ణ, బోయపాటి కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం 'అఖండ'కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన రావడంతో చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. 




Nandamuri Balakrishna
Akhanda 2
Boyapati Srinu
Telugu movies
Tollywood
Mass movies
Samyuktha
Adi Pinisetty
Thaman
Movie teaser

More Telugu News