GV Prakash Kumar: ఓటీటీలో తమిళ క్రైమ్ థ్రిల్లర్ .. ఊపిరి బిగబట్టాల్సిందే!

Black Mail Movie Update
  • తమిళంలో రూపొందిన 'బ్లాక్ మెయిల్'
  • ప్రధాన పాత్రల్లో జీవీ ప్రకాశ్, బిందుమాధవి 
  • సన్ నెక్స్ట్ చేతికి ఓటీటీ హక్కులు 
  • ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

జీవీ ప్రకాశ్ కుమార్ ఒక వైపున సంగీత దర్శకుడిగా ఎదుగుతూనే, మరో వైపున హీరోగా కూడా తన జోరును కొనసాగిస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. అలా రీసెంటుగా ఆయన చేసిన సినిమానే 'బ్లాక్ మెయిల్'. మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో కొనసాగుతుంది. సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమవుతోంది. 
 
శ్రీరామ్ .. బింధుమాధవి .. తేజు అశ్విని ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను 'సన్ నెక్స్ట్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. థియేటర్స్ దగ్గర ఫరవాలేదని అనిపించుకున్న ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 

ఈ సినిమాలో మణి అనే పాత్రలో జీవీ ప్రకాశ్ కుమార్ కనిపించనున్నాడు. మణి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ జీవిస్తూ ఉంటాడు. అయితే ఆ ఫార్మా సంస్థలో పనిచేసే రేఖ ఇబ్బందుల్లో పడుతుంది. అలాగే అశోక్ అనే వ్యక్తి కూతురు కిడ్నాప్ చేయబడుతుంది. అలాగే అర్చన అనే యువతి కూడా ప్రమాదంలో పడుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్ కి గురవుతూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతుంటారు. వాళ్ల జీవితాలలో దాగిన రహస్యం ఏమిటి? వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఎవరు? అనేది కథ.

GV Prakash Kumar
Black Mail movie
Tamil crime thriller
Sun NXT
Bindu Madhavi
Teju Ashwini
crime thriller movies
OTT releases
Tamil movies
new movies

More Telugu News