Allu Arjun: ‘కాంతార’పై అల్లు అర్జున్ ప్రశంసలు.. ట్రాన్స్‌లోకి వెళ్లిపోయా అంటూ పోస్ట్

Allu Arjun Praises Kantara Calls it Mindblowing
  • ‘కాంతార చాప్టర్ 1’ చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్
  • సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం
  • ఇదొక మైండ్‌బ్లోయింగ్ సినిమా అని కొనియాడిన బన్నీ
  • రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో చేశారంటూ కితాబు
  • సినిమా చూస్తున్నంత సేపు ట్రాన్స్‌లో ఉండిపోయా అన్న ఐకాన్ స్టార్
దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కన్నడ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన, సోషల్ మీడియా వేదికగా తన అనుభూతిని పంచుకున్నారు. ‘కాంతార’ ఒక మైండ్‌బ్లోయింగ్ చిత్రమని అభివర్ణించారు.

"నిన్న రాత్రి ‘కాంతార’ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక ట్రాన్స్‌లో ఉండిపోయాను" అని అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టిపై ఆయన ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. "రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టి గారికి నా అభినందనలు. ఆయన ప్రతి విభాగంలోనూ అద్భుతంగా రాణించారు" అని కొనియాడారు.

చిత్రంలోని ఇతర నటీనటులు రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్య అద్భుతంగా నటించారని తెలిపారు. సంగీత దర్శకుడు అజనీశ్‌, సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్, ఆర్ట్ డైరెక్టర్ ధరణి గంగే, స్టంట్ మాస్టర్ అర్జున్ రాజ్‌ల పనితీరును కూడా అల్లు అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన నిర్మాత విజయ్ కిరగందూర్, హోంబలే ఫిలిమ్స్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

"నిజాయతీగా చెప్పాలంటే, ‘కాంతార’ అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదు" అంటూ అల్లు అర్జున్ తన పోస్ట్‌ను ముగించారు.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
Allu Arjun
Kantara
Kantara Chapter 1
Rishab Shetty
Rukmini
Vijay Kiragandur
Hombale Films
Telugu cinema
Indian movies
box office

More Telugu News