మెటా ఏఐ విభాగంలో భారీగా ఉద్యోగాల కోత.. అమెరికా మీడియాలో కథనాలు

  • సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విభాగం నుంచి 600 ఉద్యోగాల కోత
  • ఉద్యోగులకు అంతర్గత మెమో జారీ చేసినట్లు వార్తలు
  • ఇతర విభాగాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం
ప్రముఖ టెక్ సంస్థ మెటా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. సంస్థలోని సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విభాగం నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత మెమో జారీ చేసినట్లు సమాచారం.

ప్రధానంగా ఈ తొలగింపుల ప్రభావం ఫేస్‌బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ (ఫెయిర్), యూనిట్, ప్రోడక్ట్ ఏఐ, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ఉండనుది. ఉద్యోగాలు కోల్పోయేవారు ఇతర విభాగాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

నూతనంగా ఏర్పాటు చేసిన టీబీడీ ల్యాబ్ ఉద్యోగులకు మాత్రం ఊరట లభించనుంది. ఈ విభాగానికి ఉద్యోగాల కోత నుంచి మినహాయింపు ఇవ్వడంతో పాటు భవిష్యత్తులోనూ నియమకాలు కొనసాగనున్నాయి. ఈ ఉద్యోగాల కోత నిర్ణయం వల్ల సంస్థలో అనవసర అధికారిక విధులు తగ్గి, ఉద్యోగులు తమకు కేటాయించిన పనిని మరింత శ్రద్ధతో, ప్రభావవంతంగా చేస్తారని మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ తెలియజేశారు.


More Telugu News