ప్రత్యేక కోర్టు ద్వారా లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ... సీఎం చంద్రబాబు ఆదేశాలు
- కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీ నాయుడు హత్య కేసుపై సీఎం సమీక్ష
- ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశం
- నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం
- ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకానికి ఉత్తర్వులు
- శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరిక
- సచివాలయంలో హోంమంత్రి, డీజీపీతో సీఎం సమావేశం
నెల్లూరు జిల్లా దారకానిపాడులో ఇటీవల జరిగిన లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఆయన హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, లక్ష్మీనాయుడు హత్య అత్యంత అమానుషమని, ఈ కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సూచించారు. కేసు వాదనల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి వ్యవహారాలపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.