దీపావళి... అనసూయ భావోద్వేగ పోస్టు

  • అన్ని పండుగల కన్నా దీపావళి ఎంతో ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే వాళ్లమన్న అనసూయ
  • వేకువజామున మంగళహారతి, నాన్న దీవెనలు, ఆయన ఇచ్చే పాకెట్ మనీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లమన్న అనసూయ
  • అనసూయ పోస్టు సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ దీపావళి వేడుకల్లో పాల్గొంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కుటుంబంతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్న అనసూయ, సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపూరిత పోస్టు పెట్టి అభిమానులను అలరించారు.

భర్త, పిల్లలతో దిగిన కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆమె ఇలా రాశారు. తన చిన్నతనంలో అన్ని పండగల కన్నా దీపావళే ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే వాళ్లమని పేర్కొన్నారు. ఈ పండుగ కోసం ఏడాది పొడవునా ఎదురుచూసేవాళ్లమని, తెల్లవారుజామున మంగళహారతి, నాన్న దీవెనలు, ఆయన ఇచ్చే పాకెట్ మనీ కోసం నేను, నా సిస్టర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్లమని పేర్కొన్నారు.

అమ్మ చేసే పిండి వంటల వాసనతో ఇల్లంతా నిండిపోయేదన్నారు. కొత్త దుస్తులు, రంగురంగుల రంగవల్లులు, దీపాలు, క్రాకర్లు, బాంబులు, చిచ్చుబుడ్లతో పండగ సందడి నెలకొనేదని, ఎంతో ఆనందంగా గడిపేవాళ్లమని పేర్కొన్నారు.

కానీ, ఇప్పుడు భార్యగా, అమ్మగా అవన్నీ భిన్నంగా కనిపిస్తున్నాయన్నారు. చిన్నప్పటి నవ్వుల వెనుక అమ్మ ఎందుకు కాస్త ఆందోళనగా ఉండేదో ఇప్పుడు అర్థమవుతోంది. ఆమె ఇచ్చిన ప్రేమ, శ్రద్ధ, త్యాగం విలువ ఇప్పుడు తెలిసింది. ఈ రోజు పండుగ వేడుకల్లో అలసిపోయినా, ఆ సంతృప్తి వేరేలా ఉంది. చిన్ననాటి దీపావళిని బాగా మిస్ అవుతున్నా అని అనసూయ పేర్కొన్నారు.

దీపావళి సందర్భంగా ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 



More Telugu News