పార్వతీపురంలో పేలిన టపాసుల పార్శిల్.. కూలీ మృతి
- పార్వతీపురంలో పేలిన కొరియర్ పార్శిల్
- ఘటనలో ఒక కూలీ మృతి, ఐదుగురికి గాయాలు
- విజయనగరం నుంచి వచ్చిన టపాసుల పార్శిల్
- నిబంధనలకు విరుద్ధంగా పార్శిల్ బుకింగ్
- ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని ఓ కొరియర్ కార్యాలయంలో టపాసుల పార్శిల్ పేలి ఒకరు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరగడంతో బస్టాండ్ పరిసరాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే... ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్న ఏఎన్ఎల్ కొరియర్ పాయింట్‌కు వచ్చిన ఓ పార్శిల్‌ను కూలీలు హ్యాండిల్ చేస్తుండగా అది భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు పోర్టర్లు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన రమేశ్ అనే కూలీ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది వ్యాపారులు విజయనగరంలో టపాసులు కొనుగోలు చేసి, పార్వతీపురం డెలివరీ కోసం ఈ పార్శిల్‌ను బుక్ చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో టపాసుల వంటి పేలుడు పదార్థాలను రవాణా చేయడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ, కొరియర్ సిబ్బంది నిబంధనలను గాలికొదిలి ఈ పార్శిల్‌ను స్వీకరించడం వల్లే ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది.
ఈ ఘటనపై రాష్ట్ర మంత్రులు కె. అచ్చెన్నాయుడు, వి. అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. మరోవైపు, స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ఘటనా స్థలాన్ని సందర్శించి, క్షతగాత్రులను పరామర్శించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఏఎన్ఎల్ పార్శిల్ సర్వీస్ యాజమాన్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.