తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు... వారితో మాత్రం జాగ్రత్త!: పవన్ కల్యాణ్
- ‘నయా నరకాసురుల’ను ప్రజలు ఓడించారంటూ పవన్ కీలక వ్యాఖ్యలు
- ఓటమి అక్కసుతో కొందరు ప్రజల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపణ
- అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
- మహిళలు సత్యభామ స్ఫూర్తిని అందుకోవాలని సూచన
- పర్యావరణహితంగా, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి
దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన పరోక్షంగా రాజకీయ ప్రత్యర్థులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నయా నరకాసురులను’ ప్రజలు ప్రజాస్వామ్య యుద్ధంలో ఓడించారని, అయితే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు! దీప కాంతులతో శోభాయమానంగా... సంప్రదాయబద్ధంగా నిర్వహించుకొనే పండుగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మన భారతదేశంలో చేసుకొనే ప్రతీ పండుగకీ ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాం.
దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారు. రూపాలు మార్చుకొంటూ వస్తారు. తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి.
ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.