Sangareddy fire accident: సంగారెడ్డి జిల్లా బాణసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

Sangareddy District Fire Accident at Firecracker Shop
  • సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులో అగ్ని ప్రమాదం
  • టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో నిప్పు రవ్వపడి అంటున్న మంటలు
  • కోటి రూపాయల టపాసులు దగ్ధం
సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం, సంగుపేట గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వ పడటంతో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన జరిగింది. కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్‌సేల్ అండ్ రిటైల్ టపాసుల దుకాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన హోల్‌సేల్ అండ్ రిటైల్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Sangareddy fire accident
Sangareddy district
Andole mandal
Sangupeta village
Fire accident

More Telugu News