ప్లాట్‌ఫాంపై డస్ట్‌బిన్‌లు, బెల్టులతో కొట్టుకున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది (ఇదిగో వీడియో)
- ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఘటన
- నెట్టింట వైరల్‌గా మారిన 1 నిమిషం 19 నిమిషాల వీడియో
- రైల్వే రక్షణ దళం జోక్యంతో సద్దుమణిగిన వివాదం
ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో గ్వాలియర్‌కు వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది ప్లాట్‌ఫాంపై డస్ట్‌బిన్‌లు, బెల్టులతో కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బంది పరస్పరం దాడికి దిగారు. ఈ వీడియో 1 నిమిషం 19 సెకన్ల నిడివి కలిగి ఉంది.
రైలు బయలుదేరడానికి కొద్ది ముందు ఈ ఘర్షణ జరగడం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉద్యోగుల తీరు భారత రైల్వే ప్రతిష్ఠకు నష్టం చేస్తుందని అంటున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారు భారతీయ రైల్వేల్లో పని చేయడానికి అర్హులు కాదని కొంతమంది అభిప్రాయపడ్డారు.
ఈ వీడియోలో సుమారు ఆరు నుంచి ఎనిమిది మంది పరస్పరం దాడి చేసుకున్నారు. కొందరు బెల్టుతో మరొకరిని కొట్టగా, ఇంకొంతమంది అక్కడే ఉన్న చెత్తబుట్టలను తోటి ఉద్యోగుల పైకి విసిరారు. ఈ ఘటనలో ఒకరిద్దరు ఉద్యోగులు కిందపడిపోయారు. ఈ ఘర్షణ జరుగుతుండగా కొంతమంది ప్రయాణికులు దూరంగా నిలబడి చూస్తున్నట్లుగా వీడియోలో ఉంది. రైల్వే రక్షణ దళం సిబ్బంది వచ్చినప్పటికీ, ఆ గొడవ కొనసాగింది.