Sridhar Babu: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
- ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో కీలకోపన్యాసం చేయనున్న మంత్రి
- దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు
- ఆహ్వానించిన ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన 'ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025'లో కీలకోపన్యాసం చేయనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సదస్సుగా పరిగణించబడుతుంది.
ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ ఈ మేరకు ఆయనను ఆహ్వానించారు. దేశంలో ఈ గౌరవం పొందిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు కావడం విశేషం. ఈ సదస్సు ఈ నెల 21 నుండి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరగనుంది. గత రెండేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తారు. అదే సమయంలో తెలంగాణలో ఈ రంగంలో ఉన్న అనుకూలతలు, అవకాశాలను గురించి ఆయన ప్రస్తావిస్తారు.