Yarlagadda Venkatrao: వైసీపీ కోడి గుడ్డు తెస్తే.. టీడీపీ గూగుల్‌ను తీసుకొచ్చింది: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
- గూగుల్ ఏపీకి వస్తే వైసీపీ ఏడవటం బాధాకరమన్న ఎమ్మెల్యే
- గూగుల్ టేక్ అవుట్ ద్వారా సమాచారం సేకరిస్తారనే భయం ఉందేమోనని ఎద్దేవా
- గూగుల్ ఏపీకి గేమ్ ఛేంజర్ అన్న యార్లగడ్డ వెంకట్రావు
వైసీపీ తన ఐదేళ్ల పాలనలో కోడిగుడ్డును తీసుకువస్తే, టీడీపీ గూగుల్‌ను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "గత మూడు రోజులుగా వైసీపీ నాయకులు ప్రెస్‌మీట్‌లు పెట్టి ఏమాత్రం స్పష్టంగా మాట్లాడటం లేదు. వారి మాటలను ఒకసారి శాంతంగా చూసి, రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అక్టోబర్ 14, 2025 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మక రోజు" అని అన్నారు.
గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ హబ్‌ని విశాఖలో స్థాపించేందుకు కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన తెలిపారు. మన రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ. 3,22,000 కోట్లు ఉంటే, సగటున ప్రతి సంవత్సరం రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఐదేళ్లలో ఇది రూ. 32,000 కోట్లు వంటి పెద్ద అంకెలకు చేరుతుందని అన్నారు. ఇలాంటి పెట్టుబడిని దేశంలో మొట్టమొదటిసారిగా గొప్ప స్థాయిలో ఆకర్షించడం విషయంలో కొందరు విమర్శలు ఎలా చేయగలుగుతున్నారని ప్రశ్నించారు.
దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే, ఇలాంటి గూగుల్ డేటా హబ్ ఆంధ్రకు వెళ్లిందేంటని చాలా రాష్ట్రాలు బాధపడుతున్నాయని ఆయన అన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని వైసీపీ విమర్శించడం బాధాకరమని అన్నారు. "మనకి ఏదైనా తెలియకపోతే గూగుల్ చేస్తాం. డేటా ఇస్తే తీసుకుంటాం. అటువంటి గూగుల్ మన రాష్ట్రానికి వస్తే ఊరు, పేరు లేని కంపెనీ వచ్చినట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు? 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి దేశంలో మొట్టమొదటిసారిగా వచ్చింది" అని అన్నారు.
లోకేశ్ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే, దానిని ఎలా అడ్డుకోవాలనే దుష్ట ప్రయత్నాలే వైసీపీలో కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తే మీకు మనుగడ ఉండదనే అనుమానంతో మీరు ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో 15 మిలియన్ డాలర్లు పెట్టుబడి వచ్చినప్పుడు మీరు నోరు మూసుకుని, 'వెల్‌కమ్ టూ ఏపీ గూగుల్' అని బోర్డు చూపిస్తే ప్రజలు సంతోషించేవారిని వెంకట్రావు అన్నారు. దానికి బదులుగా కాకి గోల చేస్తున్నారని విమర్శించారు.
గూగుల్‌పై ఆ కోపం ఉందా?
అభివృద్ధి చెందటం మీకు ఇష్టం లేదా, లేక కడప మాజీ ఎంపీ కేసులో గూగుల్ టెక్ అవుట్ ద్వారా సమాచారం సేకరిస్తారనే భయంతో గూగుల్‌పై మీకేమైనా కోపం ఉందా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్రానికి గూగుల్ సంస్థ వస్తుందంటే గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందని, కానీ వైసీపీ చేసే విమర్శలను చూస్తుంటే మీకు టెక్నాలజీ అర్థం కావట్లేదని భావిస్తున్నామని అన్నారు. మీకు టెక్నాలజీ తెలిస్తే మంగళవారం గూగుల్ క్లౌడ్‌లో ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యయాన్ని ప్రారంభించడాన్ని స్వాగతించేవారని అన్నారు. అలాగే డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త శకం నిన్నటి నుంచే ప్రారంభమైందని అన్నారు.
గూగుల్ రోజువారి ఆదాయం 1.07 బ్రిలియన్ డాలర్లు అని, అలాంటి సంస్థ ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తే దేశవ్యాప్తంగా 'గూగుల్ ఏపీ' ట్రెండింగ్ అయిందని, కానీ వైసీపీ వారికి మాత్రం ఇది అర్థం కావట్లేదని విమర్శించారు. ఇది ఏదో విండ్ పవర్ ప్రాజెక్టులాగా అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. ఎక్కడో భూమి విలువ తక్కువ ఉన్న దగ్గరకు వెళ్లి విండ్ పవర్ పెట్టినట్లుగా డేటా సెంటర్ పెడుతున్నట్లు వారు భావిస్తున్నారేమోనని చురక అంటించారు. అతి తక్కువ వయస్సు గల రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు వస్తున్నాయని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ ఉందని, అక్కడ పెట్టిన పెట్టుబడి కేవలం 4.4 బిలియన్లు మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. కానీ 48,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏడబ్ల్యూఎస్ మహారాష్ట్రను తీసుకుంటే 8.3 బిలియన్ల పెట్టుబడి పెడితే 81,300 ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. అలాంటిది తన ప్రాజెక్టుకు 15 బిలియన్ డాలర్లు గూగుల్ కంపెనీ పెడుతుందంటే 1.5 నుంచి 1.9 లక్షల ఉద్యోగాలు వస్తాయని అర్థం చేసుకోవాలని అన్నారు. ఒక డేటా సెంటర్ వల్ల 3 నుంచి 6 రేట్లు పరోక్షంగా ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఐటీలో పని చేసే ఎవరికైనా తెలుస్తుందని అన్నారు.
గూగుల్ హబ్ గేమ్ ఛేంజర్
విశాఖలో గూగుల్ హబ్ రావాటం వల్ల అభివృద్ధి జరుగుతుందని, ఏపీకి గూగుల్ గేమ్ చేంజర్‌గా మారబోతుందని అన్నారు. 1998లో చంద్రబాబు మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు కేవలం 20 నుండి 25 మంది ఉద్యోగులు ఉండేవారని, ఇప్పుడు దేశవ్యాప్తంగా 25 వేల ఉద్యోగాలు ఉంటే, హైదరాబాద్ మైక్రోసాఫ్ట్‌లోనే 10 వేల ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు. మైక్రోసాఫ్ట్ వచ్చాక హైదరాబాద్‌కు పలు దిగ్గజ కంపెనీలు వరుస కట్టాయని గుర్తు చేశారు. ఇప్పుడు దాదాపు 1500 దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ ముందుకు సాగుతుందంటే అందుకు హైదరాబాద్ కారణమని వ్యాఖ్యానించారు. నాడు చంద్రబాబు నాటిన మొక్క ఈరోజు మహావృక్షమై నడిపిస్తోందని అన్నారు.
అదేవిధంగా నేడు ఏపీకి గూగుల్ వచ్చిన తరువాత ఏఐ హబ్ కూడా వచ్చే అవకాశం ఉందని అన్నారు. మాజీ ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్లు గురించి చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే గత ఐదేళ్ల కాలంలో వైసీపీ రాష్ట్రంలో చేసిందేమిటో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. వైసీపీ గూగుల్ కంపెనీ రాకను వ్యతిరేకిస్తోందా, స్వాగతిస్తుందా, ఒక్క ముక్కలో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో చాలామందికి మంత్రి పదవులు కేటాయించి చాలా నష్టపోయారని అన్నారు. ఇంకా తెలుసుకోకపోతే వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
మంత్రి నారా లోకేశ్ 20 లక్షల ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక అదే లక్ష్యంతో పని చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీకి మరిన్ని కంపెనీలు రానున్నాయని, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే పరిస్థితికి వచ్చిందని అన్నారు. గతంలో బొబ్బట్లు, పచ్చళ్లు, అప్పడాలు పరిశ్రమలు తీసుకువచ్చిన వారికి ఐటీ కంపెనీల విలువ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాని పరిస్థితి ఉంది కాబట్టి కనీసం మీడియా సమావేశం పెట్టి గూగుల్ రాకను స్వాగతించాలని సూచించారు.