రాజస్థాన్‌లో ప్రైవేటు బస్సులో మంటలు.. 10 మంది మృతి

  • జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళుతుండగా విషాదం
  • థాయత్ గ్రామ సమీపంలో వెనుక భాగంలో చెలరేగిన మంటలు
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన సహాయక సిబ్బంది
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళుతున్న ఒక ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 10 మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడగా, వారిని స్థానిక జవహర్ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

జైసల్మేర్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరిన ప్రైవేటు బస్సు థాయత్ గ్రామ సమీపంలోకి రాగానే వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.


More Telugu News