ఓటీటీకి 'దృశ్యం' దర్శకుడి క్రైమ్ థ్రిల్లర్!
- అసిఫ్ అలీ హీరోగా 'మిరాజ్'
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- సెప్టెంబర్లో థియేటర్ రిలీజ్
- ఈ నెల 20 నుంచి సోనీలివ్ లో
- తెలుగులోను అందుబాటులోకి
మలయాళ సినిమాలను ఫాలో అయ్యేవారికి ఆసీఫ్ అలీ - అపర్ణ బాలమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మంచి కథాబలం .. పాత్రలలో కొత్తదనం ఉంటేనే తప్ప ఓకే చెప్పని ఆర్టిస్టులుగా వారికి పేరు ఉంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమాగా 'మిరాజ్' కనిపిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి దర్శకుడిగా జీతూ జోసైఫ్ వ్యవహరించాడు.
'దృశ్యం' సినిమాతో దర్శకుడిగా జీతూ జోసెఫ్ అందరికీ గుర్తుండిపోయాడు. ఆయన సినిమాలకి స్క్రీన్ ప్లేనే ప్రధామైన బలం అని చెప్పుకుంటారు. ఆడియన్స్ గెస్ చేయలేని మలుపులతో కథను పరిగెత్తించడం ఆయన ప్రత్యేకత. అలాంటి ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమానే 'మిరాజ్'. సెప్టెంబర్ 19వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి వివిధ భాషల్లో 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది.
అభిరామి- కిరణ్ ప్రేమించుకుంటారు. అయితే ఊహించని విధంగా కిరణ్ రైలు ప్రమాదంలో చనిపోవడంతో, అభిరామి ఆ షాక్ లోనే ఉండిపోతుంది. అదే సమయంలో కొందరు వ్యక్తులు వేరు వేరుగా ఆమెను కలుస్తారు. కిరణ్ ఏదైనా హార్డ్ డిస్క్ ఇచ్చారా? అని అడుగుతూ ఉంటారు. ఈ విషయన్ని ఆమె ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కి చెబుతుంది. ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది? అది బయటపడితే ఏమౌతుంది? అనేదే సస్పెన్స్. కథాకథనాలు .. లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయనేది థియేటర్స్ నుంచి వచ్చిన టాక్.