Dil Raju: సల్మాన్ ఖాన్ తో దిల్ రాజు భారీ సినిమా... డైరెక్టర్ ఎవరంటే..!

Dil Raju to Produce a Big Film with Salman Khan Directed by Vamshi Paidipally
  • దర్శకత్వం వహించనున్న టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి
  • ఇప్పటికే కథకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్న బాలీవుడ్ వర్గాలు
  • గేమ్ ఛేంజర్, తమ్ముడు సినిమాలతో దిల్ రాజుకు భారీ నష్టాలు
టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరుసగా ఎదురైన పరాజయాల తర్వాత ఓ భారీ ప్రాజెక్టుతో తిరిగి పుంజుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే, వంశీ పైడిపల్లి చెప్పిన ఓ కథకు సల్మాన్ ఖాన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆయన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఇతర ఒప్పందాలు, మిగిలిన విషయాలపై దిల్ రాజు బృందంతో సల్మాన్ చర్చలు జరుపుతున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చర్చలు సఫలమైతే, త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు అధికారికంగా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తమిళ స్టార్ విజయ్ తో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి, ఇప్పుడు సల్మాన్ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది.


Dil Raju
Salman Khan
Vamshi Paidipally
Bollywood movie
Tollywood producer
Game Changer movie
Varisu movie
New film project
Indian cinema
Film director

More Telugu News