Kuldeep Yadav: విండీస్‌ ఫాలో ఆన్‌.. కుల్ దీప్ దెబ్బకు కుప్పకూలిన బ్యాటింగ్ లైనప్

West Indies Follow On After Kuldeep Yadavs Bowling Masterclass
  • 248 పరుగులకు కుప్పకూలిన విండీస్
  • 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసిన స్పిన్నర్
  • ఆఖర్లో పియరీ - ఫిలిప్‌ జోడీ దూకుడు
భారత్– వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు కుల్ దీప్ యాదవ్ ధాటికి విండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఢిల్లీ పిచ్ స్పిన్ కు అనుకూలంగా మారడంతో కుల్ దీప్ రెచ్చిపోయాడు. కేవలం 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో వెస్టిండీస్ ‘ఫాలో ఆన్‌’లో పడింది. ఓవర్‌నైట్ 140/4 స్కోరుతో ఆట ప్రారంభించిన విండీస్‌.. కుల్‌దీప్‌ యాదవ్ దెబ్బకు కుదేలైంది. మూడోరోజు 248 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ను 518/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో.. 270 పరుగులు వెనకబడిన విండీస్ ఫాలో ఆన్ ఆడుతోంది.
 
పియరీ - ఫిలిప్‌ జోడీ దూకుడు..
భారత బౌలర్ల ధాటికి విండీస్ తొలి సెషన్‌లోనే ఆలౌట్ అవుతుందని భావించినా.. ఆఖర్లో పియరీ - ఫిలిప్‌ జోడీ దూకుడు ప్రదర్శించింది. దాదాపు 16 ఓవర్లపాటు ఈ జోడీ నిలబడింది. క్రీజ్‌లో పాతుకుపోతున్నట్లు కనిపించిన ఈ జోడీని లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా విడదీశాడు. రెండో సెషన్‌ తొలి ఓవర్‌లోనే పియరీని క్లీన్‌ బౌల్డ్ చేశాడు. దీంతో 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సీలెస్ తో కలిసి ఫిలిప్‌ భారత బౌలర్లను విసిగించాడు. వీరిద్దరూ తొమ్మిది ఓవర్లు ఎదుర్కొన్నారు. సీలెస్ ను కుల్ దీప్ ఔట్ చేయడంతో విండీస్ ఆలౌట్ అయింది.
Kuldeep Yadav
India vs West Indies
West Indies cricket
Kuldeep Yadav bowling
India cricket team
West Indies batting collapse
cricket test match
Pierre Phillip partnership
follow on
Delhi pitch

More Telugu News