చైన్ లాగితే ట్రైన్ ఆగుతుందని తెలుసు.. కానీ అదెలా పనిచేస్తుందో తెలుసా..!
- అత్యవసర పరిస్థితిలో రైలును ఆపేందుకు ప్రతీ కోచ్ లోనూ ఏర్పాటు
- 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ ఇంజనీర్ జార్జ్ వెస్టింగ్ హౌస్ రూపకల్పన
- నేరుగా బ్రేక్ ఎయిర్ పైప్ తో చైన్ కు లింక్.. చైన్ లాగితే ఎయిర్ లీక్
‘అత్యవసర పరిస్థితుల్లో రైలును ఆపాలంటే చైన్ లాగుము’.. అనే సూచన రైలు ప్రయాణాల్లో గమనించే ఉంటారు. ప్రతీ కోచ్ లోనూ ఎరుపు రంగులో పైన వేలాడే ఈ చైన్ లాగితే వెంటనే రైలు ఆగుతుంది. ఏదైనా ప్రమాదం సంభవించినపుడో లేక మరేదైనా అత్యవసర పరిస్థితుల్లోనో రైలును వెంటనే ఆపడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రయాణికులకు రైలును నడిపే లోకో పైలట్ కు మధ్య అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థగా ఇది పనిచేస్తుంది. చైన్ లాగితే ట్రైన్ ఆగుతుందనే విషయం అందరికీ తెలుసు కానీ అదెలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చైన్ లాగినప్పుడు ఏం జరుగుతుందంటే..
ప్రతీ కోచ్ లోనూ ఉండే ఈ ఎరుపు రంగు చైన్ నేరుగా రైలు బ్రేక్ వ్యవస్థకు అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులు ఎవరైనా చైన్ లాగినప్పుడు వెంటనే ఆ కోచ్ లోని బ్రేక్ ఎయిర్ పైప్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. పెద్ద శబ్దంతో గాలి బయటకు పోతుంది. దీంతో రైలు ఇంజన్ క్యాబిన్ లోని మీటర్ లో ఎయిర్ ప్రెషర్ తగ్గిపోతుంది. అలారం మోగి లోకో పైలట్ అప్రమత్తం చేస్తుంది.
ఈ సూచనను గమనించిన వెంటనే లోకో పైలట్.. రైలు గార్డును, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడానికి మూడుసార్లు హారన్ మోగిస్తాడు. ఆపై బ్రేక్ వేసి రైలును ఆపేస్తాడు. రైలు ఆగిన వెంటనే గార్డు, భద్రతా సిబ్బంది ఏ కోచ్ లోనైతే చైన్ లాగారో ఆ కోచ్ వద్దకు వచ్చి కారణం తెలుసుకుంటారు. అత్యవసర పరిస్థితి అయితే పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారు. కోచ్ లో మంటలు, కోచ్ లో నుంచి ప్రయాణికులు ఎవరైనా ప్రమాదవశాత్తూ పడిపోవడం.. తదితర పరిస్థితులలో చైన్ లాగి రైలు సిబ్బందిని అప్రమత్తం చేయవచ్చు. ఆకతాయితనానికో లేక అప్రాధాన్యమైన విషయాలకో చైన్ లాగితే మాత్రం రూ.వెయ్యి జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంటుంది.