నాపై కొందరు కుట్ర పన్నుతున్నారు: బొత్స సత్యనారాయణ

  • తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందన్న బొత్స సత్యనారాయణ
  • సిరిమానోత్సవంలో తను పాల్గొన్న వేదిక కూలడంపై అనుమానం వ్యక్తం చేసిన బొత్స
  • ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్  
  • గవర్నర్, సీఎంలకు లేఖ రాస్తానని వెల్లడి
వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రత్యర్థులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల పైడితల్లి సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొన్న వేదిక కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ విజయనగరంలో మీడియా సమావేశంలో ప్రత్యర్థులపై ఆరోపణలు చేశారు.

వేదిక కూలిన ఘటనపై విచారణ చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్, సీఎంకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. పైడితల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎలా కూలిందని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంలో కలెక్టర్, ఎస్పీకి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా బయటకు లాగుతామని అన్నారు. బొత్స చేసిన ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 


More Telugu News