వయసు, దుస్తుల గురించి ప్రశ్న.. మంచు లక్ష్మికి క్షమాపణలు చెప్పిన జర్నలిస్టు
- తన ప్రశ్నతో మంచు లక్ష్మి బాధపడ్డారని తెలిసిందని వెల్లడి
- ఈ ప్రశ్న ఎందుకు వేశాననే అంశంపై తాను చర్చించదలుచుకోలేదని వెల్లడి
- ఎవరినీ బాధపెట్టడం తనకు ఇష్టం లేదని అందుకే క్షమాపణ చెబుతున్నానన్న జర్నలిస్టు
ప్రముఖ నటి మంచు లక్ష్మికి ఒక తెలుగు జర్నలిస్టు క్షమాపణలు తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె గౌరవానికి భంగం కలిగించేలా ప్రశ్న అడిగినట్లు ఆరోపణలు రావడంతో ఆయన తన తప్పును అంగీకరించారు. ఆయన అటువంటి ప్రశ్న వేయడంపై మంచు లక్ష్మి ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. చివరకు ఆ జర్నలిస్టు క్షమాపణలు తెలుపుతూ ఒక వీడియోను విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ, తాను చేసిన ఇంటర్వ్యూలో ఆమెకు బాధ కలిగించేలా తాను ప్రశ్నించినట్లు యూనియన్ ద్వారా తనకు తెలిసిందని అన్నారు. తాను ఆ ప్రశ్న ఎందుకు వేశాననే అంశంపై తాను చర్చించదలుచుకోలేదని పేర్కొన్నారు. ఎవరినీ బాధపెట్టడం తనకు ఇష్టం లేదని, మంచు లక్ష్మి మనస్తాపం చెందారని తెలిసి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఈ వివాదం ఇంతటితో ముగిసినట్లేనని ఆయన ఆకాంక్షించారు.
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆ జర్నలిస్ట్ మంచు లక్ష్మి వయసు, ఆమె ధరించే దుస్తుల గురించి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న తనను తీవ్రంగా బాధించిందని, వ్యక్తిగత హుందాతనాన్ని దెబ్బతీసేలా ఉందని ఆమె ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఇది జర్నలిజం కాదని, కేవలం ప్రాచుర్యం పొందడం కోసం, వీడియో వైరల్ కావడం కోసమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని ఆమె ఆరోపించారు.