పేదింటి విద్యార్థిని చదువుకు అండగా నిలిచిన కవిత

  • మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్‌లో ఆశ్రితకు సీటు
  • ఆశ్రిత తండ్రి హఠాన్మరణం కారణంగా భారంగా మారిన ఫీజు చెల్లింపు
  • విషయం తెలిసి తానే చూసుకుంటానని కవిత హామీ
పేదింటి విద్యార్థిని చదువు కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు. ముషీరాబాద్‌కు చెందిన ఆశ్రితకు మల్లారెడ్డి టెక్నికల్ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్‌లో సీటు లభించింది. అయితే, ఇటీవల ఆశ్రిత తండ్రి హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది.

ఆశ్రిత కాలేజీ ఫీజు చెల్లించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు కవిత దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కవిత, విద్యార్థిని కాలేజీ ఫీజు మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఆశ్రిత మొదటి సంవత్సరం ఫీజు మొత్తాన్ని ఆమె తల్లికి అందజేశారు.


More Telugu News