అపార్ట్మెంట్ రెండో అంతస్తులో భారీ కొండచిలువ.. బాచుపల్లిలో కలకలం.. వీడియో ఇదిగో!
- తీవ్ర భయాందోళనలో అపార్ట్మెంట్ వాసులు
- పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్
- కొండచిలువను జాగ్రత్తగా తీసుకెళ్లి అడవిలో వదిలేసిన సొసైటీ సభ్యులు
బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లో భారీ కొండచిలువ కనపించింది. రెండో అంతస్తులోని గదిలోకి దూరిన ఈ కొండచిలువను చూసి భయాందోళనలకు గురైన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. స్నేక్ సొసైటీ సభ్యులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ భారీ కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు. అయితే, ఆ కొండచిలువ అపార్ట్మెంట్ రెండో అంతస్తు వరకు ఎలా చేరిందనేది అంతుపట్టడంలేదని పోలీసులు, స్నేక్ సొసైటీ సభ్యులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరుపుతామని పోలీసులు వివరించారు.