Rohit Sharma: 'టెస్లా' క్లబ్‌లో రోహిత్ శర్మ... కొత్త కారు కొనుగోలు

Rohit Sharma Joins Tesla Club Buys New Car
  • టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేసిన రోహిత్ శర్మ
  • పిల్లల పుట్టిన తేదీలు కలిసి వచ్చేలా కారు నంబర్ ఎంచుకున్న రోహిత్ శర్మ
  • టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ SUVలో అనేక ప్రత్యేకతలు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ తన లగ్జరీ కార్ల జాబితాలో మరో కొత్త కారును చేర్చుకున్నారు. తద్వారా టెస్లా క్లబ్‌లో సభ్యుడయ్యారు. క్రికెట్‌లో తన హిట్‌మ్యాన్ శైలితో అభిమానులను అలరించే రోహిత్, తాజాగా టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేశారు. ఈ కొత్త కారుతో ఆయన డ్రైవ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

పిల్లల పుట్టిన తేదీలు సూచించేలా కారు నంబర్

అయితే, కారు నంబర్‌ప్లేట్ వెనుక ఓ ఆసక్తికర విషయం ఉంది. రోహిత్ తన పిల్లల పుట్టిన తేదీలను ఆధారంగా చేసుకుని ‘3015’ అనే నంబర్‌ను ఎంచుకున్నారు. ఇందులో 30 ఆయన కుమార్తె సమైరా పుట్టిన రోజు (డిసెంబర్ 30), 15 ఆయన కుమారుడు అహన్ పుట్టిన రోజు (ఫిబ్రవరి 15)ను సూచిస్తున్నాయి.

టెస్లా మోడల్ వై – రియర్ వీల్ డ్రైవ్, స్టాండర్డ్ రేంజ్ వెర్షన్ అనేది టెస్లా ఇండియాకు చెందిన ప్రీమియమ్ ఎలక్ట్రిక్ SUV వేరియంట్. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన కారు మోడల్ గురించి అభిమానులు ఆసక్తిగా వెతుకుతున్నారు. టెస్లా మోడల్ వై కారు 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో రూపొందించబడింది. అంతేకాకుండా, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు ఇందులో ఉన్నాయి.

యాంబియంట్ లైటింగ్, 9 స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు దీని ప్రత్యేకతలు. భద్రత పరంగా కూడా ఇది అత్యుత్తమంగా రూపొందించబడింది. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్, టింటెడ్ గ్లాస్ రూఫ్ వంటి ఆధునిక సాంకేతికతలు డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

ఒకసారి పూర్తి ఛార్జింగ్‌తో ఈ కారు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. లాంగ్ రేంజ్ వేరియంట్ అయితే 622 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ధర విషయానికి వస్తే, స్టాండర్డ్ మోడల్ రూ.59.89 లక్షలు, లాంగ్ రేంజ్ వేరియంట్ రూ.67.89 లక్షలు.

క్రికెట్ మైదానంలో సిక్సులు కొడుతూ రికార్డులు సృష్టిస్తున్న రోహిత్, ఇప్పుడు లగ్జరీ టెస్లా డ్రైవ్‌తో ఆటోమొబైల్ అభిమానులను కూడా ఆకట్టుకుంటున్నారు. 
Rohit Sharma
Rohit Sharma Tesla
Tesla Model Y
Electric SUV
Hitman Rohit Sharma
Car Number 3015
Samaira Rohit Sharma
Ahan Rohit Sharma
Tesla India
Luxury Cars

More Telugu News