అందాలరాశిని అదృష్టం వరించేనా?

  • అందాల నాయికగా క్రేజ్ 
  • ఆరంభంలో పలకరించిన సక్సెస్ 
  • టాలీవుడ్ నుంచి వచ్చిన గ్యాప్ 
  • ఈ నెల 17న 'తెలుసు కదా' రిలీజ్ 

రాశి ఖన్నా .. వెండితెరపై అందాల జలతారు. పాలసరస్సులో తెల్ల తామరలాంటి రాశి ఖన్నాకి అభిమానులు పెరగడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అందం .. అమాయకత్వం కలగలిసినట్టుగా ఉండటమే రాశి ఖన్నాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఆమె తన కెరియర్ ను మొదలుపెట్టిన కొత్తలో, అవకాశాల కోసం తొందరపడినట్టుగా కనిపించలేదు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలనే పోషిస్తూ వెళ్లింది. ఈ ప్రయత్నంలో కొన్ని విజయాలు ఆమె ఖాతాలో చేరిపోయాయి. 

తొలినాళ్లలో రాశి ఖన్నా పెద్దగా స్కిన్ షో కూడా చేయలేదు. అయితే స్కిన్ షో చేయడానికి ఏ మాత్రం మొహమాటపడని కొంతమంది హీరోయిన్స్ నుంచి పోటీని తట్టుకోవడానికీ, బాలీవుడ్ దిశగా అడుగులు వేయడానికి రాశి ఖన్నా కూడా గ్లామర్ డోస్ పెంచే విషయంలో ఒక అడుగు ముందుకు వేయవలసి వచ్చింది. అయినా టాలీవుడ్ వైపు నుంచి ఆశించిన స్థాయిలో ఆమె ముందుకు వెళ్లలేదు. అందుకు కారణం వరుసగా ఫ్లాపులు ఎదురవుతూ ఉండటమే. 

ఈ నేపథ్యంలో 2022 తరువాత ఆమె తెలుగులో చేసిన సినిమా ఒకటి ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఆ సినిమా పేరే 'తెలుసుకదా'. సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి నీరజ కోన దర్శకత్వం వహించారు. మరో కథానాయికగా శ్రీనిధి శెట్టి కనిపించనుంది. చాలా గ్యాప్ తరువాత వస్తున్న రాశీ ఖన్నాకీ, 'జాక్' ఫ్లాప్ తరువాత వస్తున్న సిద్ధూకి ఈ సినిమా ఫలితం చాలా కీలకమనే చెప్పాలి. 



More Telugu News