Kakinada accident: లారీ కింద పడ్డా బతికిబట్టకట్టిన యువకుడు.. కాకినాడలో ఘటన.. వీడియో ఇదిగో!

Miraculous Escape Youth Survives Lorry Accident in Kakinada
  • స్కూటీపై వెళుతున్న యువకుడిని ఢీ కొట్టిన కాంక్రీట్ మిక్సర్ లారీ
  • యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో లారీ కిందపడ్డ యువకుడు
  • టైర్ల మధ్యలో పడడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ వైనం.. స్కూటీ మాత్రం నుజ్జునుజ్జు
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో స్కూటీపై వెళుతున్న యువకుడిని కాంక్రీట్ మిక్సర్ లారీ ఒకటి ఢీ కొట్టింది. దీంతో కిందపడ్డ యువకుడి పైనుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జుగా మారగా.. యువకుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన మొత్తం అక్కడున్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే..కాకినాడలో నరేందర్ అనే యువకుడు స్కూటీపై వెళుతున్నాడు. ఓ మూలమలుపు వద్ద ముందు వెళుతున్న కాంక్రీట్ మిక్సర్ లారీని ఓవర్ టేక్ చేసి యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. లారీకి అతి సమీపంలో నుంచి వెళ్లడంతో స్కూటీని లారీ ఢీ కొట్టింది. దీంతో స్కూటీ అదుపుతప్పి నరేందర్ రోడ్డుపై పడిపోయాడు. ఆపై లారీ అతని పైనుంచి వెళ్లిపోయింది.

అయితే, లారీ టైర్ల మధ్యలో పడటంతో నరేందర్ కు ప్రాణాపాయం తప్పింది. గాయాలతో పాటు మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చిన షాక్ తో నరేందర్ కొద్దిసేపు తేరుకోలేకపోయాడు. అటుగా వెళుతున్న ఓ బైకర్ సాయం అందించి నరేందర్ ను పైకి లేపాడు. అనంతరం నరేందర్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఈ ఘటనలో కాంక్రీట్ మిక్సర్ లారీ స్కూటీని కొంతదూరం వరకు లాక్కెళ్లింది.
Kakinada accident
Andhra Pradesh accident
Road accident
Concrete mixer lorry
Scooty accident
Narender
Viral video
CCTV footage

More Telugu News