పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు కీలక అడుగు .. డీపీఆర్ తయారీకి నోటిఫికేషన్

  • టెండర్ ప్రకటన విడుదల చేసిన ఏపీ జలవనరుల శాఖ
  • నేటి నుంచి టెండర్లు దాఖలు
  • బిడ్ దాఖలు చివరి తేదీ అక్టోబర్ 22 
  • కన్సల్టెన్సీకే అనుమతుల స్వీకరణ బాధ్యతలు 
పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ కీలక చర్యలు చేపట్టింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీని ఎంపిక చేయాలని నిర్ణయించి, రూ.9.20 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది.

ఈ మేరకు టెండర్ ప్రకటన వెలువడింది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిస్థాయి డీపీఆర్‌ను రూపొందించడం, కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందడం, ఇతర సంబంధిత ప్రక్రియలను పూర్తి చేయడం వంటి బాధ్యతలు ఎంపికైన కన్సల్టెన్సీకే అప్పగించబడతాయని అధికారులు స్పష్టం చేశారు.

బిడ్‌ల సమర్పణకు సంబంధించిన తేదీలు:
టెండర్ దాఖలుకు ప్రారంభ తేదీ: అక్టోబర్ 8
చివరి తేదీ: అక్టోబర్ 22
నిర్ణీత గడువులోగా అర్హత కలిగిన కన్సల్టెన్సీలు బిడ్‌లలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని సాంకేతికంగా నైపుణ్యం కలిగిన సంస్థలు మాత్రమే ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. 


More Telugu News