Telangana Group 1: గ్రూప్-1 నియామకాలు.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Telangana Group 1 Recruitments Supreme Court Relief for Telangana Government
  • గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
  • హైకోర్టు బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందుకు జోక్యం చేసుకోలేమని వెల్లడి
  • డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నియామకాలపై హైకోర్టు బెంచ్ మధ్యంతర తీర్పు వెలువరించినందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని తేల్చి చెప్పింది.

గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడంపై స్టే విధించాలని వాకు కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
Telangana Group 1
Telangana
Group 1
Supreme Court
High Court
Recruitment
Government jobs

More Telugu News