Chandrababu: నేడు స్వగ్రామం నారావారిపల్లెకు సీఎం చంద్రబాబు

Chandrababu Visits Nara Vari Palle for Brothers Death Anniversary
  • దివంగత సోదరుడు రామ్మూర్తినాయుడి ప్రథమ వర్ధంతి
  • కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్న సీఎం
  • గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన రామ్మూర్తినాయుడు
  • ఇప్పటికే గ్రామానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌, కుటుంబీకులు
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో పర్యటించనున్నారు. తన దివంగత సోదరుడు నారా రామ్మూర్తినాయుడి ప్రథమ వర్ధంతి సందర్భంగా అక్కడ జరగనున్న కుటుంబ కార్యక్రమంలో ఆయన పాల్గొని నివాళులర్పించనున్నారు.

గతేడాది రామ్మూర్తినాయుడు అనారోగ్యంతో కన్నుమూసిన విషయం విదితమే. ఆయన స్మారకార్థం మంగళవారం కుటుంబసభ్యులు సంవత్సరీకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నారావారిపల్లెకు రానున్నారు.

కాగా, ముఖ్యమంత్రి పర్యటనకు ఒకరోజు ముందే ఆయన కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. సోమవారం రాత్రి మంత్రి నారా లోకేశ్‌తో పాటు ఇతర కుటుంబీకులు గ్రామానికి చేరుకున్నారు. సీఎం తన కుటుంబసభ్యులతో కలిసి సోదరుడికి అంజలి ఘటించి, సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Chandrababu
Nara Vari Palle
Nara Lokesh
Nara Ramamurthy Naidu
Andhra Pradesh CM
Chandragiri
Tirupati District
Anniversary Ceremony
Family Event
Telugu News

More Telugu News