ఓటీటీ తెరపైకి 'కిష్కింధపురి '

  • సెప్టెంబర్ 12న రిలీజైన సినిమా 
  • 10 రోజులలో 30 కోట్ల వసూళ్లు
  • ఈ నెల 10 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ 
  • ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్  

 ఈ మధ్య కాలంలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం ఎక్కువగా కనిపించలేదు. చాలా తక్కువ సినిమాలు మాత్రమే 3 రోజుల తరువాత కూడా నిలబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో క్రితం నెలలో ఒకేరోజు విడుదలైన రెండు సినిమాలు, థియేటర్ల దగ్గర తమ జోరు చూపించాయి. అవి ఒకటి 'మిరాయ్' అయితే, మరొకటి 'కిష్కింధకాండ'. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ నుంచి వచ్చినవే.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన 'మిరాయ్' .. హారర్ టచ్ తో సాగే 'కిష్కింధకాండ' ఈ రెండూ కూడా ఒకే రోజున ఓటీటీ ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో 'మిరాయ్' స్ట్రీమింగ్ కానుండగా, అదే రోజున 'జీ 5'లో 'కిష్కింధపురి' అందుబాటులోకి రానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన 'కిష్కింధపురి'లో, అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. 

నిజానికి పోస్టర్స్ దగ్గర నుంచే ఈ సినిమా చాలామందిలో ఆసక్తిని పెంచింది. సినిమాకి వెళ్లొచ్చిన వారు కూడా కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకున్నారు. 10 రోజులలో ఈ సినిమా 30 కోట్లకి పైగా రాబట్టింది. అయితే ఈ సినిమా సోలో రిలీజ్ ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేదనే టాక్ వినిపించింది. అలాంటి ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఖాయమనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి ఏ రేంజ్ లో దూసుకుపోతుందో. 



More Telugu News