Justice Gavai: సుప్రీం కోర్టులో షాకింగ్ ఘటన.. సీజేఐపై షూ విసిరేందుకు ప్రయత్నించిన న్యాయవాది
- అడ్డుకుని బయటకు లాక్కెళ్లిన సహచర న్యాయవాదులు, భద్రతా సిబ్బంది
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఇలాంటి ఘటనలు తనను భయపెట్టలేవన్న జస్టిస్ గవాయ్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఈరోజు సంచలన ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిపై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. ఓ కేసు విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ గవాయ్ పైకి తన షూ విసిరేందుకు ప్రయత్నించాడు. నిందితుడి ప్రయత్నాన్ని సహచర నాకయవాదులు అడ్డుకున్నారు. అతడిని కోర్టు హాల్ బయటకు లాక్కెళ్లారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షాత్తూ అత్యున్నత న్యాయస్థానంలోనే జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారిస్తుండగా ఓ న్యాయవాది డయాస్ వద్దకు వెళ్లి తన షూ తీసి జస్టిస్ గవాయ్ పైకి విసిరేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ న్యాయవాదిని అడ్డుకున్నారు. ఇతర న్యాయవాదులతో కలిసి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సనాతన ధర్మాన్ని సీజేఐ అవమానించాడని సదరు న్యాయవాది నినాదాలు చేశాడు. ఇలాంటి వాటికి తాను భయపడనని పేర్కొన్న సీజేఐ జస్టిస్ గవాయ్... తర్వాత యథావిధిగా విచారణను కొనసాగించారు.