పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ సందడి
- పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
- ప్రశాంతి నిలయం వద్ద విజయ్ దేవరకొండకు స్వాగతం పలికిన ట్రస్ట్ ప్రతినిధులు
- రెండు రోజుల క్రితం విజయ్, రష్మిక మధ్య వివాహ నిశ్చితార్థం
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ నిన్న శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సందడి చేశారు. ఇక్కడి శ్రీ సత్యసాయి విద్యాలయంలో విద్యనభ్యసించిన విజయ్ దేవరకొండకు పుట్టపర్తితో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆయన ముందుగా ప్రశాంతి నిలయం చేరుకోగా, శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ ప్రతినిధులు విజయ్‌కు స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నల మధ్య నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని విజయ్ స్వగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలిసింది. ఈ జంట వచ్చే ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయంపై ఇరువురు ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.