30 కోట్ల సినిమా 300 కోట్లు రాబడితే ..!

  • ఆగస్టులో విడుదలైన సినిమా 
  • సూపర్ హీరో కాన్సెప్ట్ తో నడిచే కథ 
  • కల్యాణి కెరియర్లో పెద్ద హిట్ 
  • కెమెరామెన్ కి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత ఎవరికి ఎప్పుడు సక్సెస్ వస్తుందనేది ఎవరికీ తెలియదు. వారసులైనా ఈ విషయంలో మినహాయింపు ఉండదు. బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చినా, సరైన హిట్ కోసం ఎవరైనా వెయిట్ చేయవలసిందే. అలా వెయిట్ చేయడం వలన ఫలితం ఉంటుందా .. లేదా అనే దానికి కూడా ఎవరూ సమాధానం చెప్పలేరు. అయినా వేయి చేసినందుకు కల్యాణి ప్రియదర్శన్ ఒక రేంజ్ హిట్ ను తన ఖాతాలో వేసుకో గలిగింది. ప్రస్తుతం ఈ హిట్ ను ఆమె సెలబ్రేట్ చేసుకుంటోంది. 

దర్శకుడిగా ప్రియదర్శన్ కి గొప్ప పేరు ఉంది. ఆయన కూతురే కల్యాణి ప్రియదర్శన్. బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చిన ఆమె, తెలుగులోను 'హలో' .. 'చిత్రలహరి' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ బ్యూటీ చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆమె డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో 'లోక: చాప్టర్ 1' సినిమా చేసింది. ఇది తెలుగులో 'కొత్త లోక' పేరుతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించింది. 

యూత్ వైపు నుంచి మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నెస్లెన్ కూడా ఈ సినిమాలో మరో ప్రధానమైన పాత్రను పోషించాడు. సూపర్ హీరో తరహా కాన్సెప్ట్ తో .. ఫాంటసీని టచ్ చేస్తూ సాగే ఈ సినిమాను 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఆగస్టు 28వ తేదీన విడుదలైన ఈ సినిమా, 300 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ మధ్య కాలంలో అతిపెద్ద విజయాన్ని సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా, ఆయనకి ఒక రేంజ్ లో లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా కెమెరా మెన్ కి కల్యాణి ప్రియదర్శన్ దాదాపు 10 లక్షల ఖరీదైన వాచ్ ను బహుకరించడం విశేషం. 



More Telugu News