అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి మృతి

  • అమెరికాలో ప్రజ్వరిల్లిన తుపాకీ సంస్కృతి
  • ఉదయం డాలస్ నగరంలో కాల్పుల ఘటన
  • ప్రాణాలు కోల్పోయిన చంద్రశేఖర్
  • చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాదులోని ఎల్బీనగర్
  • బీడీఎస్ అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా పయనం
అమెరికాలో తుపాకీ సంస్కృతి మరోసారి పడగవిప్పింది. ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ స్వస్థలం హైదరాబాద్ లోని ఎల్బీనగర్.

బీడీఎస్ అనంతరం ఉన్నత చదువుల కోసం అతడు అమెరికా వెళ్లాడు. డాలస్ నగరంలో ఉదయం జరిగిన ఈ కాల్పుల ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ ఓ పెట్రోల్ బంకులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. పెట్రోల్ కోసం వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో చంద్రశేఖర్ మృతి చెందాడు. 

దాంతో హైదరాబాద్ లోని అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రశేఖర్ మరణవార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


More Telugu News