ప్రకాశం జిల్లాలో రెండు తలల దూడ జననం
- జన్యుపరమైన కారణాల వల్లేనని వైద్యుల వివరణ
- అత్యంత అరుదుగా చోటుచేసుకుంటాయని వెల్లడి
- దూడ ఆరోగ్యంగా ఉందని పేర్కొన్న పశు వైద్యుడు
అయితే, దూడకు రెండు తలలు ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యానని, వెంటనే పశువైద్యుడు బ్రహ్మయ్యకు సమాచారం అందించానని వెంకటరెడ్డి తెలిపారు. దూడను, గేదెను పరిశీలించిన బ్రహ్మయ్య.. జన్యుపరమైన లోపాల వల్ల అత్యంత అరుదుగా ఇలాంటి దూడలు పుడతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు తలల దూడ ఆరోగ్యంగానే ఉందని వివరించారు. కాగా, ఈ వింత దూడను చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు.