Kantara Chapter 1: కాంతార ఛాప్టర్ 1 ఓపెనింగ్ డే కలెక్షన్స్ వివరాలు ఇవిగో!

Kantara Chapter 1 Opening Day Collections Revealed
  • సెన్సేషన్ సృష్టిస్తోన్న కాంతార ఛాప్టర్ 1
  • తొలి రోజు కలెక్షన్లు రూ.89కోట్లు
  • కన్నడ మూవీకి తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్లు రావడం విశేషంగా భావిస్తున్న సినీ వర్గాలు
  • చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ఎన్టీఆర్, ప్రభాస్ తదితరులు
బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ గురువారం విడుదలై సంచలనం సృష్టిస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.89 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం.

కన్నడ సినిమాకు మొదటి రోజు ఈ స్థాయి కలెక్షన్లు రావడం విశేషంగా భావిస్తున్నారు. టికెట్ బుకింగ్ పోర్టల్ బుక్‌మైషోలో ఒక్క రోజులోనే 1.28 మిలియన్ టికెట్లు విక్రయాలు జరగడం గమనార్హం. ఈ ఏడాదిలో బుక్‌మైషో వేదికగా ఇది రెండవ అత్యధిక టికెట్ విక్రయాలు నమోదు చేసిన చిత్రంగా నిలిచింది.

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో టాప్ 4:
పుష్ప 2 – 1.75 మిలియన్ టికెట్లు
కాంతార చాప్టర్ 1 – 1.28 మిలియన్ టికెట్లు
జవాన్ – 1.14 మిలియన్ టికెట్లు
కల్కి 2898 A.D. – 1.12 మిలియన్ టికెట్లు

ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖ సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్, ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

ఇక కన్నడ హీరో యశ్, ‘కాంతార చాప్టర్ 1’ను భారతీయ సినీ రంగంలో ఒక బెంచ్‌మార్క్‌గా అభివర్ణిస్తూ, నటుడు-దర్శకుడిగా రిషబ్ శెట్టి ప్రతిభను కొనియాడారు.

ఈ ప్రీక్వెల్ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా, బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటించారు. సంస్కృతి, మానవతా విలువలు, ఆధ్యాత్మికతను సమ్మిళితంగా చూపిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఓ కొత్త అనుభూతిని నింపింది. 
Kantara Chapter 1
Rishab Shetty
Kantara prequel
BookMyShow
Opening day collections
Rukmini Vasanth
Gulshan Devaiah
Sandeep Reddy Vanga
Yash
Kannada movie

More Telugu News