Rajnath Singh: రక్షణ శాఖ భూములు.. రాజ్‌నాథ్ సింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక విజ్ఞప్తి

Rajnath Singh Telangana Government Requests Key on Defense Lands
  • రక్షణ శాఖ భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని మెమోరాండం
  • తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన యూజర్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్న పొన్నం ప్రభాకర్
  • కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు త్వరగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్న పొన్నం
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని కొన్ని రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అభ్యర్థించింది. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన రాజ్‌నాథ్ సింగ్‌కు హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అంశాలపై ఆయన ఒక మెమోరాండం సమర్పించారు.

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేశారు. అదేవిధంగా, కంటోన్మెంట్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన సుమారు రూ. 1000 కోట్ల యూజర్ ఛార్జీలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ బకాయిలను సకాలంలో విడుదల చేయడం ద్వారా రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రోత్సాహకంగా ఉంటుందని ఆయన అన్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడంతో ప్రజాస్వామ్య పాలన మరియు స్థానిక ప్రాతినిథ్యం దృష్ట్యా ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని రాజ్‌నాథ్ సింగ్‌కు అందజేసిన వినతి పత్రంలో పొన్నం ప్రభాకర్ కోరారు. వినతి పత్రాన్ని పరిశీలించి కేంద్ర మంత్రి తగు నిర్ణయం తీసుకుంటారని పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గత నెలలో ఢిల్లీలో రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో ప్రతిష్ఠాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం హైదరాబాద్‌లోని 98.20 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

గత నెలలో ఢిల్లీలో రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో, ప్రతిష్ఠాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌లోని 98.20 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీ, ఈసా నదుల సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీని స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలను ముఖ్యమంత్రి ఆ సమయంలో కేంద్ర మంత్రికి వివరించారు.
Rajnath Singh
Telangana Government
Defense Lands
Hyderabad
Ponnam Prabhakar
GHMC
Secunderabad Cantonment

More Telugu News