Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలు .. నారా లోకేశ్ స్పందన

Nara Lokesh Reacts to Four New Kendriya Vidyalayas for Andhra Pradesh
  • ఏపీకి నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాల మంజూరు
  • ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్
  • కేంద్ర నిర్ణయం రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక విద్యా ప్రోత్సాహాన్ని అందించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

మంగళసముద్రం (చిత్తూరు జిల్లా), బైరుగణిపల్లె (కుప్పం మండలం, చిత్తూరు జిల్లా), పలాస (శ్రీకాకుళం జిల్లా), శాఖమూరు (అమరావతి)లలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదిక ద్వారా స్పందించారు. "ఇది ఆంధ్రప్రదేశ్ విద్యా రంగానికి గొప్ప విజయం. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు నిదర్శనం. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఇవి దోహదపడతాయి," అని లోకేశ్ పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లకు లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 
Nara Lokesh
Andhra Pradesh
Kendriya Vidyalaya
AP Education
Central Government
Chittoor District
Srikakulam District
Amaravati
Dharmendra Pradhan
Narendra Modi

More Telugu News