ఆంధ్రప్రదేశ్‌కు 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు.. స్పందించిన చంద్రబాబునాయుడు

  • ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు
  • మంగళసముద్రం, బైరుగణిపల్లె, పలాస, శాఖమూరులలో ఏర్పాటు
  • ప్రధాని మోదీకి చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలను నెలకొల్పడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మంగళసముద్రం, బైరుగణిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతిలోని శాఖమూరులో ఈ నూతన విద్యా సంస్థలు కొలువుదీరనున్నాయి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు నాణ్యమైన విద్యావకాశాలను అందించడంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా ఉన్న ప్రాంతాల అవసరాలను తీర్చడంలో ఈ విశ్వవిద్యాలయాలు తోడ్పడుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


More Telugu News