Siddaramaiah: పూర్తికాలం నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా: సిద్ధరామయ్య

Siddaramaiah I will continue as Chief Minister for full term
  • డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉందన్న కుణిగల్ ఎమ్మెల్యే
  • ఐదేళ్లు నేనే సీఎంగా కొనసాగుతానన్న సిద్ధరామయ్య
  • మైసూరు దసరా ఉత్సవాల్లో పుష్పార్చన చేస్తాననే నమ్మకం ఉందన్న సిద్ధరామయ్య
ముఖ్యమంత్రిగా తమ గురువు డీకే శివకుమార్‌ను చూడాలని కుణిగల్ ఎమ్మెల్యే సహా పలువురు పార్టీ నేతలు డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

"నేను పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతాను. వచ్చే ఏడాది మైసూరు దసరా ఉత్సవాల్లో పుష్పార్చన చేస్తాననే నమ్మకం కూడా ఉంది. అయితే, పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను" అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

అంతకుముందు కుణిగల్ ఎమ్మెల్యే రంగనాథ్ మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి డీకే శివకుమార్ చేసిన కృషిని పార్టీ అధిష్ఠానం గుర్తించాలని కోరారు. డీకే శివకుమార్ తన రాజకీయ గురువు అని, ఆయన సామాజిక సేవతో పాటు పాలనలోనూ తనదైన ముద్ర వేశారని అన్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలను డీకేఎస్‌కు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ఓటర్లు కూడా ఇదే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ దిశగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Siddaramaiah
DK Shivakumar
Karnataka Chief Minister
Congress
Kunal MLA Ranganath
Mysore Dasara

More Telugu News