Mohsin Naqvi: ఆసియా కప్ ట్రోఫీ, మెడల్స్ తీసుకెళ్లిన పాకిస్థాన్ నఖ్వీ.. బీసీసీఐ ఆగ్రహంతో యూఏఈ బోర్డుకు అప్పగింత

Mohsin Naqvi Takes Asia Cup Trophy BCCI Angered Handed Over to UAE Board
  • ట్రోఫీని నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి టీమిండియా నిరాకరణ
  • ట్రోఫీ, మెడల్స్‌ను తనతో తీసుకువెళ్లిన నఖ్వీ
  • నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ పదవి నుండి తొలగించాలని బీసీసీఐ డిమాండ్
  • బీసీసీఐ డిమాండ్‌తో యూఏఈ బోర్డుకు ట్రోఫీని అప్పగించిన నఖ్వీ
ఆసియా కప్ టైటిల్‌ను గెలిచినప్పటికీ, ట్రోఫితో పాటు మెడల్స్‌ భారత జట్టుకు అందలేదు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహిన్ నఖ్వీ చేతుల మీదుగా వాటిని స్వీకరించడానికి భారత క్రికెటర్లు నిరాకరించారు. దీంతో ట్రోఫీ, మెడల్స్‌ను నఖ్వీ తనతో పాటు తీసుకువెళ్లాడు.

నఖ్వీ ట్రోఫీ, మెడల్స్‌ను తీసుకెళ్లడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీసీ సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. ట్రోఫీని, మెడల్స్‌ను భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశాన్ని బీసీసీఐ, ఐసీసీ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. ట్రోఫీ చౌర్యం, నియమాలను ఉల్లంఘించినందుకు నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ పదవి నుంచి తొలగించి, అతనిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ, ఐసీసీపై ఒత్తిడి తెచ్చింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆందోళన చెందిన నఖ్వీ, ఆసియా ట్రోఫీని, మెడల్స్‌ను యూఏఈ బోర్డుకు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, వాటిని ఆ బోర్డు టీమిండియాకు ఎలా అందజేస్తుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మంగళవారం వర్చువల్‌గా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు నఖ్వీని ప్రశ్నించారు. ఆసియా టోర్నీ కప్ టీమిండియాకు చెందుతుందని, అది వ్యక్తిగత ఆస్తి కాదని బీసీసీఐ ప్రతినిధులు స్పష్టం చేశారు.
Mohsin Naqvi
Asia Cup 2024
BCCI
ACC
UAE board
trophy
medals
Suryakumar Yadav

More Telugu News