కరూర్ నగర్ తొక్కిసలాట ఘటన... నటుడు విజయ్ కీలక నిర్ణయం

  • రాష్ట్ర పర్యటనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన
  • రాష్ట్రవ్యాప్త పర్యటనను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడి
  • కొత్త షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని టీవీకే ప్రకటన
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేపట్టిన రాష్ట్రవ్యాప్త పర్యటనలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త పర్యటనలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇటీవల విజయ్ కరూర్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో టీవీకే 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

"తొక్కిసలాట ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన బాధ, దుఃఖం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే రెండు వారాల పాటు బహిరంగ సభ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. పర్యటనలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని మా అధినేత ఆమోదంతో తెలియజేస్తున్నాం" అని పార్టీ హెడ్ క్వార్టర్స్ సెక్రటరియేట్ ప్రకటించింది.


More Telugu News