హైదరాబాద్ పాతబస్తీలో రాక్ పైథాన్ కలకలం.. ఇదిగో వీడియో
- హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ కాలేజీ ప్రాంతంలో కనిపించిన రాక్ పైథాన్
- కొండ చిలువను బంధించిన వన్యప్రాణుల సంరక్షకుడు రిజ్వీ
- త్వరలో అటవీశాఖ అధికారులకు అప్పగించనున్న రిజ్వీ
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో రాక్ పైథాన్ కొండచిలువ కలకలం రేపింది. ఎక్కడి నుండి వచ్చిందో కానీ, పాతబస్తీలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ కాలేజీ ప్రాంతంలో, జనావాసాల మధ్య రాక్ పైథాన్ జాతికి చెందిన కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
స్థానికులు వెంటనే వన్యప్రాణి సంరక్షకుడు సయ్యద్ తాకీ అలీ రిజ్వీకి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రిజ్వీ చాకచక్యంగా కొండచిలువను బంధించారు. ఆయన ఆ కొండచిలువను అటవీ శాఖ అధికారులకు అప్పగించనున్నారు. అటవీ శాఖ అధికారులు దానిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టనున్నారు.