పదవీ బాధ్యతలు చేపట్టిన తెలంగాణ నూతన డీజీపీ
- తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి
- రాష్ట్రానికి ఆరవ డీజీపీగా నియామకం
- ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించిన శివధర్ రెడ్డి
1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్ రెడ్డి, తొలుత ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన తెలంగాణ క్యాడర్‌కు మారారు. ఐపీఎస్ అధికారిగా శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1996 నుంచి 2000 మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి సబ్ డివిజన్లలో ఏఎస్పీగా సేవలందించారు.
ఆ తర్వాత, గ్రేహౌండ్స్‌లో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కూడా ఆయన విధులు నిర్వహించారు. ముఖ్యంగా ఉగ్రవాద కదలికలను గుర్తించడంలో, వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించి మంచి గుర్తింపు పొందారు.