Nagarjuna Sagar Student Drowned: నాగార్జున సాగర్‌లో హైదరాబాద్ విద్యార్థి గల్లంతు
- కూకట్‌పల్లి నుండి విహారయాత్రకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు
- ఫొటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తూ నదిలో పడిన విద్యార్థి
- చాణక్య కోసం గాలింపు చేపట్టిన ఎస్డీఆర్ఎఫ్
నాగార్జునసాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థి గల్లంతయ్యాడు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఆరుగురు విద్యార్థులు నాగార్జునసాగర్‌కు విహారయాత్ర నిమిత్తం వెళ్లారు. పుష్కర్ ఘాట్ వద్ద విద్యార్థులు సరదాగా ఫొటోలు దిగుతుండగా, 18 ఏళ్ల చాణక్య అనే విద్యార్థి ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపిగాలింపు చర్యలు చేపట్టారు. చాణక్య కోసం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపిగాలింపు చర్యలు చేపట్టారు. చాణక్య కోసం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.