200 కోట్లు పెడితే వచ్చింది 100 కోట్లే!

  • సెప్టెంబర్ 5న విడుదలైన 'మదరాసి'
  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగే కథ 
  • సంగీతాన్ని సమకూర్చిన అనిరుధ్ 
  • అక్టోబర్ 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

ఈ మధ్య కాలంలో టైటిల్ తోనే ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమాల జాబితాలో మనకి 'మదరాసి' కనిపిస్తుంది. శివకార్తికేయన్ - రుక్మిణి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, మురుగదాస్ దర్శకత్వం వహించాడు. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్ పై లక్ష్మీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 5వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తమిళనాట ఫరవాలేదు అనిపించుకుంది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి  ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో, విద్యుత్ జమ్వాల్ కీలకమైన పాత్రను పోషించాడు. శివకార్తికేయన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు 200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా, 100 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 

ఈ కథ అంతా అక్రమ ఆయుధాల రవాణా చుట్టూ తిరుగుతుంది. ఉత్తర భారతం నుంచి తమిళనాడుకి తరలిస్తున్న అక్రమ ఆయుధాల రవాణకు సంబంధించిన సిండికేట్ ను అడ్డుకోవడమే ప్రధానమైన అంశంగా ఈ కథ నడుస్తుంది. ఆ సిండికేట్ హీరో - హీరోయిన్స్ ను ఎలా టార్గెట్ చేసింది? దానిని నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అనేదే కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి మరి. 



More Telugu News