Telangana Talli Flyover: హైదరాబాద్ లోని 'తెలుగు తల్లి' ఫ్లైఓవర్ పేరు మారింది!

Hyderabad Telugu Talli Flyover Renamed Telangana Talli Flyover
  • 'తెలంగాణ తల్లి' ఫ్లైఓవర్ గా పేరు మార్పు
  • పేరు మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
  • కొత్త పేరుతో బోర్డు ఏర్పాటు చేసిన అధికారులు
హైదరాబాద్ లోని కీలకమైన ఫ్లైఓవర్లలో ఒకటైన 'తెలుగు తల్లి' ఫ్లైఓవర్ పేరు మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ పేరును ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేయడంతో ఈ మార్పు అధికారికంగా అమల్లోకి వచ్చింది.

రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం సమీపంలో ఈ ఫ్లైఓవర్ ఉంది. ఇప్పటివరకు ‘తెలుగు తల్లి' ఫ్లైఓవర్‌గా అందరికీ సుపరిచితమైన ఈ ఫ్లైఓవర్... ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా గుర్తింపు పొందనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే ఈ మార్గంలో అధికారులు కొత్త పేరును సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు.
Telangana Talli Flyover
Hyderabad
Telangana
Telugu Talli Flyover
Flyover Name Change
Secretariat
Telangana Government
Roads
Infrastructure

More Telugu News