Saddam: అబార్షన్ చేసుకోమన్నాడని ప్రియుడి గొంతుకోసి చంపేసిన మైనర్.. రాయ్ పూర్ లో దారుణం

Raipur Crime Minor Girl Murders Engineer Boyfriend Saddam
  • మైనర్ తో ఇంజనీరింగ్ అధికారి సహజీవనం
  • బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం ఒత్తిడి
  • కత్తితో బెదిరించిన ప్రియుడు.. అదే కత్తితో ప్రియుడిని చంపేసిన బాలిక
ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో దారుణం జరిగింది. ఓ మైనర్ తో సహజీవనం చేసిన ఇంజనీర్.. అదే బాలిక చేతిలో హత్యకు గురయ్యాడు. అబార్షన్ చేయించే ప్రయత్నానికి బాలిక అడ్డుచెప్పడంతో ఆగ్రహం పట్టలేక ప్రియుడు ఆమెను కత్తితో బెదిరించాడు. అయితే, రాత్రిపూట ప్రియుడు నిద్రిస్తున్న సమయంలో అదే కత్తితో అతని గొంతుకోసి చంపేసింది. ఆపై ఇంటికి వెళ్లి తల్లితో జరిగిన ఘోరం గురించి చెప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన సద్దామ్ అభాన్‌పూర్‌లో ఇంజనీరింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బిలాస్ పూర్ కు చెందిన 16 ఏళ్ల బాలికతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయంపై సద్దామ్ కు, బాలికకు మధ్య గొడవ జరిగింది. మూడు నెలల గర్భాన్ని తొలగించుకోవాలని సద్దామ్ ఒత్తిడి చేయగా.. బాలిక మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

సెప్టెంబర్ 28న రాయ్ పూర్ లోని అవోన్ లాడ్జ్ లో సద్దామ్, బాలిక కలుసుకున్నారు. గర్భందాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని బాలిక డిమాండ్ చేయగా.. సద్దామ్ అంగీకరించలేదు. వెంటనే గర్భం తొలగించుకోవాలని చెబుతూ కత్తితో బెదిరించాడు. దీంతో ఆ రోజు రాత్రి నిద్రలో ఉన్న సద్దామ్ ను బాలిక గొంతుకోసి చంపేసింది. ఆ తర్వాత రాయ్ పూర్ నుంచి బిలాస్ పూర్ లోని తన ఇంటికి వెళ్లిపోయింది. తన తల్లికి విషయం చెప్పడంతో వెంటనే బాలికను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. రాయ్‌పూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, సద్దామ్ కుటుంబాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. "ఇది క్షణికావేశంలో జరిగినదా? లేక ముందస్తు ప్రణాళికలో భాగమా? అనేది విచారణలో బయటపడుతుంది" అని పోలీసులు తెలిపారు.
Saddam
Saddam murder
Raipur crime
Minor girl
Abortion dispute
Chhattisgarh crime news
Love affair murder
Avon Lodge
Bilaspur
Engineering officer

More Telugu News