నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్!

  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
  • అక్టోబర్ 16న కర్నూలులో జరగనున్న జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించనన్న సీఎం
  • ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశమయ్యే అవకాశం
  • సీఐఐ సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఈరోజు (మంగళవారం) ఉదయం వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో వారు కేంద్ర నేతలతో కీలక భేటీ కానున్నారు. 
 
ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. అక్టోబర్ 16వ తేదీన కర్నూలులో జరగనున్న జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధాని మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక మద్దతు, ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశం ఉంది.
 
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి సీఐఐ సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం ఉంది.
 
ఇక మంత్రి నారా లోకేశ్ కూడా ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర ఐటీ, విద్య రంగాలకు సంబంధించిన కేంద్ర సహకారంపై వారు చర్చించనున్నట్లు తెలిసింది. అయితే ఒకే రోజు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. 


More Telugu News