రోడ్డు పక్కన పానీపూరి తింటాను: హీరోయిన్ శ్రీనిధి శెట్టి

  • 'కేజీఎఫ్'తో ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి 
  • తొలి సినిమాతోనే పాన్ ఇండియా హిట్
  • ఇమేజ్ ను పట్టించుకోనన్న బ్యూటీ 
  • సింపుల్ గా ఉండటమే ఇష్టమని వెల్లడి
  • అక్టోబర్ 17న 'తెలుసుకదా' హిట్

సాధారణంగా ఏ హీరోయిన్ అయినా, తమ మొదటి సినిమా తప్పకుండా పెద్ద హిట్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఒక హిట్ కి కెరియర్ ను చాలాదూరం నడిపించే శక్తి ఉంటుంది. అయితే అలాంటి ఒక అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే దక్కుతూ ఉంటుంది. ఆ తక్కువ మందిలో ఒకరుగా శ్రీనిధి శెట్టి కనిపిస్తారు. ఆమె ఫస్టు మూవీ 'కేజీఎఫ్' పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకోవడమే అందుకు నిదర్శనం.

తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ, " మా పేరెంట్స్ కి మేము ముగ్గురం ఆడపిల్లలమే. నేను పదోతరగతిలో ఉండగా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి నాన్న ఎన్నో కష్టాలను భరిస్తూ మమ్మలను పెంచారు. ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. అదే నన్ను ఈ ఫీల్డ్ కి వచ్చేలా చేసింది. 'కేజీఎఫ్' తరువాత నేను ఎక్కడికి వెళ్లినా ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకున్నారు" అని అన్నారు. 

'కేజీఎఫ్' తరువాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయినా నాకు నచ్చినవి మాత్రమే ఎంచుకుంటూ వెళుతున్నాను. నాకు ఎంత క్రేజ్ వచ్చినా సింపుల్ గా ఉండటమే ఇష్టం. అవసరమైతే క్యాబ్ లో వెళతాను. సూపర్ మార్కెట్ కి .. షాపింగ్ మాల్స్ కి నేను వెళుతూ ఉంటాను. రోడ్డుపక్కన పానీపూరీ కూడా తినేసి వస్తుంటాను. కాకపోతే అక్కడివాళ్లు గుర్తుపట్టేలోగా బయటపడిపోతూ ఉంటాను" అని చెప్పారు. సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా ఆమె నటించిన 'తెలుసు కదా' సినిమా, అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు రానున్న విషయం తెలిసిందే.



More Telugu News