Rukmini Vasanth: కుర్రకారులో ఆసక్తిని రేపుతున్న 'కనకవతి'

Rukmini Vasanth Special
  • అంచనాలు పెంచిన 'కాంతార 2'
  • 'కనకవతి' పాత్రలో రుక్మిణి వసంత్
  • లుక్ తోనే మార్కులు కొట్టేసిన బ్యూటీ
  • 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా  
  • అక్టోబర్ 2వ తేదీన పాన్ ఇండియా రిలీజ్  
      
రుక్మిణి వసంత్ .. కన్నడలో చేసిన ఒక చిన్న సినిమా ఆమెను యూత్ కి కనెక్ట్ చేసింది. తెరపై సహజంగా .. సింపుల్ గా కనిపిస్తూనే మార్కులు కొట్టేసింది. చక్కని కనుముక్కు తీరు .. అందమైన నవ్వు ఆమెకి పెద్ద సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టాయి. అలాంటి రుక్మిణి వసంత్ తాజాగా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కాంతార: చాప్టర్ 1' సిద్ధమవుతోంది. 125 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 2వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.  

ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న ట్రెండులో కథానాయికలకు విలక్షణమైన పాత్రలు దక్కడమనేది అరుదైన విషయంగా మారిపోయింది. అలాంటి పరిస్థితులలో రుక్మిణి వసంత్ కి 'కనకవతి' పాత్రను పోషించే ఛాన్స్ తగిలింది. కనకవతి ఒక యువరాణి. అడవిని ఆనుకుని ఉన్న ఒక గిరిజన యువకుడిని .. అతనికి మద్దతునిచ్చే వారిని అణచివేసే పనిలో రాజు ఉంటాడు. ఆ యువకుడిపై ఆమె మనసు పారేసుకోవడంతో కథ మరో మలుపు తిరుగుతుంది.

ఈ సినిమాలో 'కనకవతి' లుక్ తో రుక్మిణి వసంత్ యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాకి ఆమె ప్రేమకథనే ప్రధామైన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాపై ఆమె చాలానే ఆశలు పెట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఉండటంతో, తన కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుందని ఆమె భావిస్తోంది. రుక్మిణి వసంత్ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబడుతుందనేది చూడాలి.

Rukmini Vasanth
Kanakavathi
Kantara Chapter 1
Kannada movie
Youth interest
Pan India movie
Love story
Tribal youth
Princess role
Rishab Shetty

More Telugu News