: చికెన్ అడిగిన ఏడేళ్ల కొడుకు.. కొట్టి చంపిన తల్లి
- అప్పడాల కర్రతో తల, శరీరంపై కొట్టి చంపిన తల్లి
- పొరుగింటి వ్యక్తి అనుమానంతో వెలుగులోకి వచ్చిన దారుణం
- పచ్చకామెర్లతో చనిపోయాడని కట్టుకథ అల్లిన నిందితురాలు
- 10 ఏళ్ల కుమార్తెపైనా దాడి.. ఆసుపత్రికి తరలింపు
- నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
చికెన్ అడిగిన ఏడేళ్ల కుమారుడి కోరిక తీర్చాల్సిన తల్లి కసాయిగా మారింది. అప్పడాల కర్రతో విచక్షణ రహితంగా కొట్టి చిన్నారి ప్రాణాలు తీసింది. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పాల్ఘర్ జిల్లా ధన్సర్ గ్రామంలోని ఘోర్డిలా కాంప్లెక్స్‌లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె ఏడేళ్ల కుమారుడు చిన్మయ్ ధుమ్డే చికెన్ కూర వండమని తల్లిని అడిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి ఇంట్లో ఉన్న అప్పడాల కర్రతో బాలుడి తల, శరీరంపై కొట్టింది. దెబ్బలకు తాళలేక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయినప్పటికీ కనికరం చూపని ఆ తల్లి, అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే వదిలేయడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
బాలుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న ఓ పొరుగింటి వ్యక్తి వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ నేలపై దుప్పటి కప్పి ఉన్న బాలుడి మృతదేహాన్ని చూశాడు. ఏమైందని తల్లిని ప్రశ్నించగా పచ్చకామెర్లతో చనిపోయాడని ఆమె చెప్పింది. అనుమానం వచ్చిన అతను దుప్పటి తీసి చూడగా, బాలుడి ఛాతీ, వీపు, ముఖంపై తీవ్ర గాయాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసుల విచారణలో మరో దారుణమైన విషయం బయటపడింది. నిందితురాలు తన 10 ఏళ్ల కుమార్తెపై కూడా అదే కర్రతో దాడి చేసినట్లు తేలింది. తీవ్ర గాయాలపాలైన ఆ బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మెరుగైన సంరక్షణ కోసం ఆమెను దహనులోని ఓ ఆశ్రమానికి పంపించారు. మొదట భయంతో నిజం చెప్పని ఆ బాలిక, ఆ తర్వాత తల్లే తమ ఇద్దరినీ కర్రతో కొట్టిందని పోలీసులకు వివరించింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన అప్పడాల కర్రను స్వాధీనం చేసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1) (హత్య) కింద కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.